Header Banner

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దిగి వచ్చిన మెట్రో.. టికెట్ ధరలు తగ్గింపు.. ఎంతంటే!

  Tue May 20, 2025 15:41        Politics

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణికులకు ఊరటనిచ్చే ఒక వార్త. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీల విషయంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పునరాలోచన చేసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది. ఇటీవల ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. తగ్గించిన ఈ కొత్త ఛార్జీలు ఈ నెల 24వ తేదీ నుంచి వర్తిస్తాయని మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది. నగరంలో రోజూ మెట్రో సేవలను వినియోగించుకునే వేలాది మందికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. క‌నీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గ‌రిష్ఠ టికెట్ ధ‌ర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచినట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. అయితే ఈ పెరిగిన ధరలో 10 శాతాన్ని తగ్గించాలని హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం నిర్ణయించింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices #Metro #MetroCharges #Changes #TicketCost